సిద్దిపేట ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌గా హనుమంతరావుఅదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

 హైదరాబాద్‌,నవంబర్‌16జనం సాక్షి ): సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా సంగారెడ్డి కలెక్టర్‌ ఎం. హనుమంతరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న హనుమంత రావుకు కలెక్టర్‌ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి  స్వచ్ఛందంగా పదవీ విరమణ కోరుతూ సిఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. వెంకట్రామిరెడ్డి విఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.