హైదరాబాద్,నవంబర్16(జనం సాక్షి ): హైందవ సంస్కుత్రిలో గోవుకి విశిష్ట స్థానం ఉందని, పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమ శివునికి అత్యంత ఇష్టమై, సకల దేవతలు కొలువుండే గోమాతను దర్శించి పూజించడం ఆనందంగా ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనిలోని నమో మిషన్ వందే గోశాలను మంత్రి గంగుల సందర్శించారు. సకల శుభాలు కలుగజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ పై, రాష్ట్రంలోని ప్రజలందరిపై ఆదేవుని కరుణ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, వైస్ ఎంపిపి వీరారెడ్డి, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుల ఏకనందం తదితరులు పాల్గొన్నారు.