హైదరాబాద్,నవంబర్29(జనం సాక్షి): పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కూకట్‌పల్లి డివిజన్ ప్రకాశం నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుని పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం, కార్పోరేటర్ జూపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ..అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, బస్తీవాసులు టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
నల్లపోచమ్మ ఆలయ ప్రతిష్టలో ఎమ్మెల్యే