వీర్‌చక్రఅవార్డును అందచేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
న్యూఢల్లీి,నవంబర్22(జనం సాక్షి): పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్`16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారతీయ వైమానిక దళ పైలెట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీర్ చక్ర అవార్డును అందజేశారు. ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో అభినందన్ ఆ అవార్డును స్వీకరించారు. 2018, మే 19వ తేదీ నుంచి మిగ్`21 బైసన్ స్క్వాడ్రన్‌లో అభినందన్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే 2019, ఫిబ్రవరి 27వ తేదీన.. ఎల్వోసీ వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్`16, ఎఫ్`17 యుద్ధ విమానాలను అభినందన్ గమనించాడు. తన వద్ద ఉన్న రేడార్‌తో శత్రు దేశ విమానాల రాకను పసికట్టాడు. అయితే ముప్పు ఉందని గ్రహించిన అభినందన్.. చాలా సాహసోపేతంగా, ఎంతో చాకచక్యంగా తన వద్ద ఉన్న మిస్సైల్‌తో ఎఫ్`16ను కూల్చేశాడు. బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.