పాలనారంగంలో బిజెపి ఘోర వైఫల్యం

  


దేశ రైతాంగాన్ని చంపి క్షమాపణలు చెప్పిన దుర్మార్గ ప్రభుత్వం

750మంది  రైతులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులు

దేశాన్ని అప్పుల పాలు చేసిన బిజెపి పాలకులు

దేశంలో మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు

ఈ ప్రభుత్వాన్ని సాగనంపకుంటే శంకరగిరి మాన్యాలే

కేంద్రం తీరుతో వచ్చేయాసంగిలో కొనుగోలు కేంద్రాలు బంద్‌

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

కేబినేట్‌ భేటీ అనంతరం విూడియా సమావేశంలో ఘాటు విమర్శలు

హైదరాబాద్‌,నవంబర్‌29( జనంసాక్షి ): పాలనారంగంలో అనేక వైఫల్యాలను మూటగ్టటుకున్న బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమయ్యిందన్నారు. దేశంలో ఆహారభద్రత కొరవడిరదని, ఆహారసూచీలో ఇతర దేశాలతో వెనకబడి ఉందన్నారు. కేంద్రం తీరువల్ల ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిన దుస్థితి పెరిగిందన్నారు. నిరుద్యోగం పెరిగింది. ఆహార కొరతలో అల్లాడుతున్నాం. లక్షల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం తీరు కారణంగా..వారు ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేసిన కారణంగా యాసంగిలో ఇక ధాన్యం కొనుగోలు చేయబోమని కేబినేట్‌ తీర్మానించిందన్నారు. ఈ దేశంలో రైతుల సమస్యలు తీరాలంటే మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని పారదోలాల్సిందేనని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని నూటికి నూరుశాతం పారదోలాల్సిందేనని అన్నారు.  తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేబినెట్‌ భేటీ తర్వాత సీఎం కేసీఆర్‌ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, హరీష్‌ రావులతో కలసి విూడియాతో మాట్లాడారు. ధాన్యంపై కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని కేసీఆర్‌ విమర్శించారు. దేశ రైతాంగాన్ని కేంద్రం గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు. కేంద్రం చిల్లర కొట్టు షావుకారుగా వ్యవహరిస్తోందని, ఆహార భద్రత సామాజిక బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిందని చెప్పారు. నష్టం వస్తే కేంద్రం భరించాలని, నిల్వలు ఎక్కువైతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ సూచించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. 750మంది రైతులను పొట్టన పెట్టుకున్న తరవాత సాగుచట్టాలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పిన దిక్కుమాలిన పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్యాస్‌, పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని విమర్శించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనమని కేంద్రం స్పష్టంగా చెప్పింది. రా రైస్‌ ఎంత తీసుకుంటారో కూడా కేంద్రం చెప్పలేదు. 90లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. యాసంగిలో వడ్లు పండితే నూక ఎక్కువగా వస్తుంది. నష్టపోకుండా ఉండేందుకే మిల్లర్లు బాయిల్డ్‌ రైస్‌ చేస్తున్నారు. మెడపై కత్తిపెట్టి కేంద్రం బలవంతంగా అగ్రిమెంట్‌ రాయించుకుంది. ఢల్లీికి వెళ్తే మొహంలేక మాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందివ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినా.. ప్రాజెక్టులు నిర్మించాం. రైతులకు అండగా ఉంటామని కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్‌ రైస్‌ కొనించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్‌ రైస్‌ కొనించాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.  వరి విషయంలో కిషన్‌ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుందని కేసీఆర్‌ ఆరోపించారు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందివ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినా.. ప్రాజెక్టులు నిర్మించామని కేసీఆర్‌ తెలిపారు. ఇదే సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో వచ్చేది బాయిల్డ్‌ రైసేనని, బాయిల్‌ చేయకుంటే వచ్చేది 50శాతమేనన్నారు. ఈ ఉల్టా పల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ఒక రాష్టాన్రికి కేంద్ర మంత్రి ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతరు. ఎందుకు కొనరు, మా రాష్ట్రంలో అట్లనే పండుతది.. యాసంగిలో మాకు బాయిల్డ్‌ రైసే వస్తది తీసుకోవాలని చెబితే సిపాయి కిషన్‌రెడ్డి. ఎట్లా అయినా నేను కొనిపిస్తే అంటే సిపాయి కిషన్‌రెడ్డి. కొనమని చెప్పే కేంద్రమంత్రి కావాలన్న తెలంగాణకు. చాతకాని దద్దమ్మ. ఆయన ఏం మాట్లాడుతున్నడు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నడు. విూకు దమ్ముంటే ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవో తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనిపియ్యాలే. బాయిల్డ్‌ రైస్సే తెలంగాణ నుంచి వస్తది. 35 డిగ్రీల్లో ఎండల్లో మా పండుతది మా పంట.. కొనమని చెప్పాలి. విూ చేతగాని తనాన్ని మంది విూద రుద్దుతరా?. విూది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చారు. విూ ప్రధానే ఇవాళ క్షమాపణలు చెప్పారు భారత దేశ రైతాంగానికి. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతకుల పార్టీ విూది..విూరు మాట్లాడుతారా? విూది రైతు రాబంధుల పార్టీ. 750 రైతులు చనిపోయింది నిజం కాదా.. 13 నెలల పాటు కరోనాలో, ఎండ, వానాలో చస్తే ఆందోళన జీవులని అవమానపరిచారు. కొట్టి సంపుమని హర్యానా సీఎంకు చెప్పి.. కారెక్కించి తొక్కించి సంపి చివరకు క్షమాపణలు చెప్పి.. చివరకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు. మేం రైతుబంధువులం. నాశనమైన చెరువులను బాగు చేయలే కనపడుతలేవా? దా.. ఏ వూరికి వస్తవో.. ప్రాజెక్టులు మేం కట్టలేదా? ఆయకట్టు స్థిరీకరణ కాలేదా?. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేదా? ఎవరు పూర్తి చేశారు? ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు ప్రాజెక్టు, నెª`టటెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్‌, దేవాదుల ప్రాజెక్టు ఎవరు పూర్తి చేశారని ప్రశ్నించారు.