సన్నాహాలు చేస్తున్న సొసైటీ
హైదరాబాద్,డిసెంబర్21( జనం సాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి ఏటా జరిగే ఆలిండియా ఇండస్టియ్రల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. కరోనా కారణంగా గతేడాది ఎగ్జిబిషన్ నిలిచిపోగా ఈ ఏడాది నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా రూల్స్ తో నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒమిక్రాన్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ కి వచ్చే వారు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ మార్గం ఆదిత్య తెలిపారు. దాదాపు 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తుండగా.. నుమాయిష్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.15 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఏటా దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది స్టాళ్ల సంఖ్యను తగ్గించారు నిర్వాహకులు. ఎంట్రీ ఫీజు రూ.30 కాగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశంతో ఫ్రీ పార్కింగ్? సదుపాయంల్పించారు.
జనవరి 1నుంచి నుమాయిష్