20లోగా ఓటర్ల సవరణ పూర్తి కావాలి

  


అధికారులను ఆదేశించిన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌

ఖమ్మం,డిసెంబర్‌1 (జనంసాక్షి):-   ఓటర్ల సవరణ పక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్‌ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ పక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లాలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణపై సవిూక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితాలో నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకోసం అందిన ఫిర్యాదులన్ని ఆన్‌లైన్‌ ద్వారా గరుడయాఎª`లో అఎª`లోడ్‌ చేసేవిధంగా బూత్‌ లెవల్‌ అధికారుకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే స్వీకరించిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను ఈ నెల 4 వ తేదీలోగా గరుడ యాప్‌లో  అప్‌లోడ్‌ చేసే విధంగా బూత్‌ లెవల్‌ అధికారులను సంసిద్ధం చేయాలని తెలిపారు. నవంబరు నెలలో చేపట్టిన స్పెషల్‌ క్యాంపెయిన్‌ ద్వారా అందిన క్లయిమ్స్‌ను పరిశీలించి ఈ నెల 4 వ తేదీలోగా పరిషరించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.3 లక్షల క్లయిమ్స్‌ అందాయని, వాటిలో ఇంకా 1 లక్ష 68 వేల క్షయిమ్స్‌ వివిధ జిల్లాలో పెండిరగ్‌ లో ఉన్నాయని వాటిని ఈ నెల 20 వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లు సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణపై నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి జిల్లా స్థాయిలో ఓటరు అవగాహన ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, స్వీప్‌ నోడల్‌ అధికారులు దీనిపై సత్వర చర్యలు చేపట్టాలని ప్రసారాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను సంబంధిత వాట్సప్‌ గ్రూపు ద్వారా ప్రతి రోజు పంపించాలన్నారు. అదే విధంగా ఓటరు హెల్ప్‌ లైన్‌ గురించి ఓటరు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యనపర్చాలని, ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఓటరు నేరుగా ఓటరు హెల్ప్‌ లైన్‌ ద్వారా ఆ సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభీ, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూధన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దశరథ్‌, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్రనాధ్‌, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్‌ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.