27న కలెక్టరేట్‌ ముందు విఆర్‌ఎల ధర్నా

ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): వీఆర్‌ఏలను క్రమబద్ధీకరణచేసి రూ.21 వేల వేతనం అందించాలని వీఆర్‌ఏల సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చి వీఆర్‌ఏలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వీఆర్‌ఏల సమస్యలపై ఈ నెల 27వ తేదీన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు.