31న భోజన కార్మికుల ఆందోళన

నెల్లూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న డీఈవో కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతోపాటు 6 నెలల నుంచి బిల్లులు, వేతనాలు రాకపోవడంతో మధ్యాహ్నభోజన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాలో కార్మికులు పాల్గొనాలని కోరారు.