మహారాష్ట్ర రైతుల సంఫీుభావం
చిత్తూరు, డిసెంబర్11 (జనంసాక్షి) : ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆప్రాంత రైతులు , మహిళలు చేస్తున్న ’ న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 41వరోజుకు చేరింది. శనివారం చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నుంచి అంజిమేడు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇందులో భాగంగా దాదాపు 17 కిలోవిూటర్లు మేరకు పాదయాత్ర జరగనుంది. పాదయాత్ర మధ్యలో మహిళా రైతులకు స్థానిక మహిళలు పసుపు, కుంకుమ ,తాంబూళం ఇచ్చారు. మరోవైపు ఈ యాత్రకు మహారాష్ట్ర రైతులు సంఫీుభావం తెలిపారు. పుణె, పింప్రి, చించువాడ్, బోసారి ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు .. అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. సాటి రైతుల ఇబ్బందులను చూసి ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. ఈనెల 17వ తేదీన తిరుపతిలో తాము నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారని అమరావతి రైతులు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.