విశాఖకు 770 కి.మీ దూరంలో వాయుగుండం

నేడు తీరం దాటే అవకాశం

అమరావతి,డిసెంబర్‌3(జనంసాక్షి): ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం విశాఖపట్నానికి 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి జవాద్‌ తుపాన్‌ మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వాయుగుండం గంటకు 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. నేటి ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా రావొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మొన్నటికి మొన్న కురిసిన వర్షాల వల్ల భారీగా నష్టపోయిన ఏపీ తాజాగా మరో తుఫాన్‌ ధాటిని ఎదుర్కోవలసి వస్తోంది. శనివారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీస్తాయి. రేపు ఉదయం నుంచి మరింత వేగంతో 70-90కి.మీ బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉ:డాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల అధికారులు, ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి: విశాఖ కలెక్టర్‌ తుపాను ప్రభావం నుంచి ప్రజలకు సాయంగా ఉండేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున రెడ్డి తెలిపారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 55 ఎస్డీఆర్‌ఎఫ్‌ సభ్యులను సిద్ధం చేసినట్లు తెలిపారు........1,317 పోస్టుల్ని భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వంపలు శాఖల్లో నోటిఫికేషన్స్‌ విడుదలఅమరావతి,డిసెంబర్‌3(ఆర్‌ఎన్‌ఎ): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా జాబ్‌ నోటిఫికేషన్స్‌ విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2, ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌ 2, ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్‌ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్‌ సోర్సింగ్‌  పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ పద్ధతిలో 896 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రకటించిన 1,317 పోస్టులకు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్‌ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.  దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ ఫామ్‌ డౌన్‌లోడ్‌ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడిరచిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.