7,8 తేదీల్లో తెలుగు సంబరాలు

ఏలూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలకు 60 దేశాల నుంచి ప్రతినిధులు, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు పాల్గొంటారు. పెద అమిరం వెస్ట్‌ బెర్రీ హైస్కూలులో విజయవంతం చేయాలని గజల్స్‌ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ కోరారు. తెలుగు భాషా ఔన్నత్యాన్ని భావి తరాలకు తెలపాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.