జిల్లాలో నాగోబా జాతర సందడి


ఘనంగా నిర్వహణపై చర్చలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొడలయ్యింది. వచ్చే నెలలో జరిగే జాతరకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నాగోబా దేవతకు అవసరమయ్యే గంగాజాలాన్ని తెచ్చేందుకు ఈనెల 25న కాలినడకతో బయల్దేరుటకు నిర్ణయించారు. ఈనెల 25న మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన వారు హాజరై కాలినడకతో బయల్దేరుతారని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రచారానికి ప్రచారరథం ఇప్పటికే బయల్దేరింది. కేస్లాపూర్‌ గ్రామంలోని గుడిలో మెస్రం వంశీయుల పటేల్‌ మెస్రం వెంకట్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశమై ప్రచార రథం బయలు దేరి ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించడంపై చర్చించారు. ఐదు రోజుల పాటు ప్రచార రథం పర్యటించి కేస్లాపూర్‌ చేరుకుంటుందని మెస్రం వంశీయులు నిర్ణయించారు. ఇదిలావుంటే ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటి పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు అన్నారు. కేస్లాపూర్‌ గ్రామంలో మెస్రం వంశం పెద్దలతో సమేశమై నాగోబా జాతర నిర్వహణపై చర్చించా రు. జనవరి 4న చంద్రదర్శనం చూసి నాగోబా జాతర మహాపూజ నిర్వహణపై జనవరి 5న రథయాత్ర ప్రారంభించి మెస్రం వంశీయుల ఉన్న ఏడు గ్రామాలను సందర్శించి నాగోబా మహాపూజ జాతర నిర్వహణపై ప్రచారం చుయనునుట్లు తెలిపారు. జనవరి 31న పుష్యమాసం అమవాస్యను పురష్కరించుకొని నాగోబా ఆలయంలో మహాపూజ నిర్వహిస్తామన్నారు.