సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గిరిజన గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా

తమ దృష్టికి తీసుకరావాలని గ్రామస్తులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు సాగునీరు అందిస్తామని, రైతులకు ఎకరానికి రూ.నాలుగు వేల చొప్పున రెండు పంటలకు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులు పంట సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.