కరోనా బారినపడ్డ టెన్నిస్‌ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌


మాడ్రిడ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రముఖ టెన్నిస్‌ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌ కరోనా బారినపడ్డాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. తర్వాత స్పెయిన్‌కు చేరుకున్న అనంతరం సోమవారం కొవిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చిందని సోమవారం నాదల్‌ ప్రకటించాడు. ’నేను కొన్ని బాధాకరమైన క్షణాలను కలిగి ఉన్నాను. దీంట్లో నుంచి మెరుగుపడతానని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నాను. నాతో క్లోజ్‌గా ఉన్నవారంతా దయచేసి టెస్టులు చేయించుకోండి’ అంటూ సూచించాడు. ఈ సందర్భంగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆస్టేల్రియన్‌ ఓపెన్‌ టోర్నీలో పాల్గొనడంపై సందేహం వ్యక్తం వ్యక్తం చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగే టోర్నీకి అందుబాటులో ఉండేది లేనిది ఖచ్చితంగా తెలియదని చెప్పాడు. తను భవిష్యత్‌లో పాల్గొనే టోర్నమెంట్లు, నిర్ణయాలపై అభిమానులకు తెలియజేస్తానని, తనకు మద్దతు తెలుపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.