మొఘలుల కాలం నాటి నాణెళిలు లభ్యం

భోపాల్‌,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) : మధ్యప్రదేశ్‌ తికమ్‌గర్హ్‌ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణెళిలు లభ్యమయ్యాయి. ఈ నాణెళిలు మొఘలుల కాలం నాటివి అని అధికారులు పేర్కొన్నారు. ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడిరది. దీంట్లో పురాతన నాణెళిలు లభించినట్లు అధికారులు తెలిపారు.బుందేల్‌ఖాండ్‌ రీజియన్‌లో ఓ ప్రవేయిటు కాంట్రాక్టర్‌కు చెందిన మైనింగ్‌లో ఈ పురాతన నాణెళిలు లభ్యమైనట్లు జిల్లా మైనింగ్‌ అధికారి ప్రశాంత్‌ తివారి వెల్లడిరచారు. ఆ నాణెళిలు బయటపడ్డ ప్రదేశాన్ని పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. 164 నాణెళిల్లో 12 వెండి నాణెళిలు ఉన్నాయని, మిగతావి కాపర్‌ నాణెళిలు అని తెలిపారు. ఈ నాణెళిలన్నింటిని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. బుందేల్‌ఖాండ్‌ రీజియన్‌లో ఒకప్పుడు ఆఫ్ఘన్స్‌, మొఘల్స్‌ తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.