` చివరిగింజ వరకు పంటను కొనాల్సిందే
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,డిసెంబరు 27(జనంసాక్షి): చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరి వేయవద్దని అనడానికి విూరెవరని అన్నారు. రైతులు బీజేపీ, టీఆర్‌ఎస్ లపై కోపంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో ఈ రెండు పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నా యని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరి ఒప్పందంలో భాగంగానే.. బీజేపీ నిరుద్యోగం అని కొత్తరాగం ఎంచుకుందన్నారు. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తే తెలంగాణలో ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేవ న్నారు. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు.. అది పాకిస్తాన్ లేదని, దానికి పాస్‌పోర్ట్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలకు బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల వైఖరే కారణమన్నారు. రైతుల వరి పంటను కొనుగోలు చేయబోమన్న సీఎం కేసీఆర్.. తన ఫామ్‌హౌస్‌లో వరి పంట ఎందుకు వేశారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వడ్లు కొనేవారు.. రైతుల వడ్లు కొనరా అని నిలదీశారు. రైతులు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ నేతలు రైతుల సమస్యలు పక్కన పెట్టి.. నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని ఆరోపించారు. నిరుద్యోగు లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్.. వరి వద్దు అని చెప్పి తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వరి విత్తనాలు అమ్మితేనే కేసులు పెడతామన్న కలెక్టర్‌కి కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చాడు. కేసీఆర్ వరి విత్తనాలను ఎందుకు సాగు చేశాడో, వ్యవసాయశాఖ మంత్రి, కేసీఆర్ ఇద్దరూ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను దొంగగా చూడాలన్నారు. మా నాయకులను గొర్రెలా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
రేంవత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత
తీవక్ర ఉద్రిక్త పరిస్తితుల మధ్య పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఎర్రవెల్లికి వెళ్లకుండా రేవంత్ ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు అక్కడికి చేరుకుని నిర్బంధించారు. దీంతో కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని కేసీఆర్‌కు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదంటూ రేవంత్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రేవంత్ ఇంటికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు రేవంత్ ఎర్రవెల్లి వెళ్లేందుకు బయటకు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇంటి నుంచి కార్యకర్తలు,నేతలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు... వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసుల తీరుపై మండి పడ్డారు రేవంత్ రెడ్డి. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. భారీ పోలీసుల బందోబస్తుతో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు జగగిత్యాలలో గృహనిర్బంధం చేశారు. ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నాయన్నారు. 150 ఎకరాల్లో సీఎం కేసీఆర్ ఎలా వరి సాగు చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఒక నీతి.. రైతులకో నీతా అని జీవన్ రెడ్డి నిలదీశారు.మరో ఎమ్మెల్యే శ్రీధర్ బాబును సైతం పోలీసులు అడ్డుకున్నారు.