కొత్త ఏడాదిలో అయినా పాలనాతీరు మారాలి !

  సబ్‌కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌...ప్రధాని చెబుతున్నదీ..ప్రజలు కోరుకుంటున్నదీ ఇదే...! తాజాగా కొత్త సంవత్స రంలో జరిగే ఐదు రాష్టాల్ర ఉప ఎన్నికల సందర్బంగా ప్రధాని మోడీ తన ప్రచారంలో పదేపదే ఇదే నినాదాన్ని వల్లె వేస్తున్నారు. ఇంకా ఆయన కాంగ్రెస్‌ పాలన గురించి...దాని వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ మనకు కావాల్సింది అదికాదు. ఏడున్నరేళ్లలో ఏం చేశామో అవలోకనం చేసుకోవాలి. దేశానికి ప్రధానిగా తాను చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు ఫలితం ఇస్తున్నాయో మోడీ గమనించడం లేదు. అందుకు సాగుచట్టాల రద్దు తాజా ఉదాహరణగా తీసుకోవాలి. ప్రజలు ఆందోళన చేసేదాకా నిర్ణయాలు సవిూక్షించుకోక పోవడం సరికాదు. ఏడున్నరేళ్లుగా మోడీ పాలనతీరు చూస్తే అన్ని రంగాల్లో వైఫల్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలం వేగంగా పరుగెడుతున్నది. కరోనా ప్రజలను వెన్నాడుతోంది. మరోమారు ఒమిక్రాన్‌ రూపంలో భయపెడుతోంది. ఇప్పటికే ప్రజలు కరోనాతో తమ ఇళ్లను ఊడ్చి పెట్టేశారు. వారు బతకడమే దుర్భరంగా మారింది. నోట్లరద్దు దుష్పరిణామాలు ఇంకా వెన్నాడుతు న్నాయి. దీనికితోడు జిస్టీ వాతలు ప్రజలను కోలుకోకుండా చేస్తున్నాయి. భారత్‌ లాంటి దేశంలో కేవలం 5 శాతం లోపు జిఎస్టీ సరిపోతుంది. కానీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించడం లేదు. జిఎస్టీ వసూళ్లు పెరిగాయని చంకలు గుద్దుకుని అనుత్పాదక రంగాలను పెంచి పోషిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ ఉపాధిని దెబ్బతీస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల కల్పన, ఉపాధిరంగాలకు ప్రోత్సాహం ఇవ్వండ లేదు. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగానా ఇంకా కోట్లాదిమంది అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.

మంచికాలం వస్తుందిని చెప్పిన అచ్చేదిన్‌ నినాదంగా మారిపోయింది. అనేక రకాలుగా ప్రజలను ముప్పుతి ప్పలు పెట్టిన 2021 సంవత్సరం వికటాట్టహాసం చేస్తూ పోతోంది. కొత్త సంవత్సర వేళ సామాన్యులకు మళ్లీ మంచి రోజులు వచ్చేలా పాలకులు తమ విధానాలు మార్చుకోవాలి. ప్రజల కోణంలో ఆలోచన చేయాలి. ప్రజలను ఒడ్డుకు చేర్చే నిర్ణయాలు తీసుకోవాలి. అచ్చేదిన్‌...సబ్‌కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌ కార్యరూపం దాల్చాలి. నినాదాలను పట్టాలకెక్కించడం ద్వారా ప్రధాని మోడీ 2022లో అత్యున్నత భారత్‌ కోసం పని చేయాలి. రాజకీయ నాయకుల మాటలకు, చేతలకు మధ్య అంతరం లేదని నిరూపించాలి. సమాజహితం కోసం విస్తృతంగా పనిచేసేలా చూడాలి. అలాంటి సమాజ నిర్మాణం కోసం విధాన నిర్ణయాలు తీసుకోవాలి. అన్నింటికి మించి అందిరికీ ఆహారం అందడంతో పాటు అన్నదాతలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. వ్యవసాయాన్ని పండగచేసేలా ప్రోత్సాహకాలు అందించాలి. కరోనాతో కుదేలయిన ఆర్థికరంగాన్ని పట్టాల కెక్కించాలి. వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలను పెంపొందించుకునే ఆరాటంలో సమస్యలను తక్కువగా చేసి చూడ రాదు. కరోనా మహమ్మారిపై విజయం సాధించామని అనుకోరాదు.ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొ నేలా ఆసుపత్రులలో రోగుల సహాయార్థం ఆక్సిజన్‌ సౌకర్యం మొదలు అన్ని వ్యవస్థలను ఆధునీకరించాలి. పేదల కు అండగా వైద్య సదుపాయాలు రావాలి. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందిని ’కోవిడ్‌ వారియర్స్‌’ అని ప్రశంసించడంతో సరిపెట్టకుండా వారు భరోసాగా విధులు నిర్వహించే స్థితి రావాలి. కొవిడ్‌ మరణాల సంఖ్యలో దాపరికాలు ఉండకూడదు. అలా మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండగలుగుతామన్న భరోసా ఇవ్వాలి. సమున్నత ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను పాటిస్తున్నామని నిరూపించేలా రాజకీయ వ్యవస్థను మార్చాలి. పరిశ్రమల మూసివేతతో వీధినపడ్డ కార్మికుల గురించి పట్టించుకోవవడం ఒక ఎత్తయితే..అసలు పరిశ్రమలు మూతపడకుండా
నిలబెట్టే పరిస్థితి రావాలి. సరిహద్దుల్లో చైనా, పాక్‌ల దురగా తాలను దునుమాడాల్సిందే. భారత్‌ జోలికి వస్తే అంతే సంగతులు అన్న సంకేతం ఇవ్వాల్సిందే. ఇందు కోసం మన శక్తిని సన్నద్దం చేయాల్సిందే. అంతేగాకుండా మంచులో విధులు నిర్వహిస్తున్న సైనికులు కడుపునిండా తిని, సరిహద్దులు కంటికి రెపస్పలా కాపాడేలా అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలి. మన సౌకర్యాల కల్పనలో ఎంపిలు, ఎమ్మెల్యేలకన్నా అతనే ముందు అన్న విధంగా ప్రాధాన్యత కల్పించాలి. సరిహద్దు సైనికుడే మన తొలి ఆరాధ్య దైవంగా భావించాలి. సైనికంగా మహాశక్తిమంతంగా, సమరానికి సర్వ సన్నద్ధంగా ఉండే భారత్‌ నిర్మాణం జరగాలి. జాతీయ భద్రతా వ్యవహారాలను దేశ రాజకీయాకు దూరంగా ఉంచాలి. పెరుగుతోన్న నిరుద్యోగిత, పడిపోతున్న ఆదాయాల ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందీ అంచనా వేసుకోవాలి. సంపన్నుల ప్రయోజనాలు కాకుండా,పేదల అభ్యున్నతి ప్రభుత్వ ఆర్థిక ఎజెండా కావాలి. కార్పోరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు కాకుండా ప్రజలు ఎజెండాగా ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు ఉండాలి. జిఎస్టీ పేరుతో విచక్షణారహితంగా అధిక పన్నులు విధించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా పేదల కడుపుకొడుతున్నామని గుర్తించి దీనిని తక్షణం సవిూక్షించాలి. ఈ క్రమంలో పెట్రో ధరలను తగ్గిస్తేనే సరుకు రవాణా కూడా తగ్గుతుందని గుర్తించి ముందుకు సాగాలి. రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేసేలా కాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు ఎవరు అన్యాయం చేసినా నిగ్గదీస్తాయన్న సందేశం రావాలి. ప్రలోభాలు, బెదిరింపులతో పార్టీ ఫిరాయింపు లను పోత్సహించని రాజకీయ వ్యవస్థను రూపొందించాలి. రాజకీయమంటే వ్యాపారంగా మారిన వ్యస్థను మార్చాలి. అప్పుడే మనం కలలు కన్న భారత్‌ను నిర్మించుకోగలం. పార్లమెంటులో పూర్తి బలం ఉన్న బిజెపి పాలకులు గత పాలకుల కన్నా భిన్నంగా దేశాన్ని ముందుకు తీసుకుని వెళతారన్న విశ్వాసంలో ఉన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదు. ప్రజలకోణంలో..ప్రజల కోసం పాలన సాగాలి. భారత్‌ను ఉజ్వలంగా నిలపడం ఒక ఎత్తయితే అసమానతలు లేని భారత సమాజాన్ని నిర్మించడం కోసం మోడీ సంకల్పం తీసు కోవాలి. అప్పుడే మోడీ సబ్‌కా సాథాª`..సబ్‌ కా వికాస్‌ నినాదానికి భరోసా వస్తుంది. అచ్చేదిన్‌ వచ్చాయని ప్రజలు కూడా విశ్వసిస్తారు. ఈ కొత్త సంవత్సరంలో అలాంటి ప్రయత్నం చేయడం ద్వారా బిజెపి తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం.