బస్సును వేగంగా ఢీకొన్న కారు


ప్రమాదంలో ఒకరు మృతి

వరంగల్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ):  జిల్లాకేంద్రంలోని ఆటోనగర్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు కిందకు కారు దూసుకెళ్లింది. సంఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో కారు ముందు భాగం, ఆర్టీసీ బస్సు వెనుక భాగం ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.