లక్ష్యాన్ని పూర్తిచేస్తున్నాం

జనగామ,డిసెంబర్‌11 (జనంసాక్షి) :

లింగాలఘనపురం మండలంలో  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యానికి చేరువలో ఉన్నామని తెలిపారు. మండలంలో 17గ్రామ పంచాయతీలు ఉండగా పటేలుగూడెం, బండ్లగూడెం గ్రామాల్లో పూర్తి అయ్యాయన్నారు. ఈ రెండు గ్రామాల్లో 140పూర్తి చేశామన్నారు. మిగతా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు వెల్లడిరచారు. ఈ నెలాఖరువరకు అన్ని గ్రామాల్లో పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.