పెద్దశేష వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుపతి,డిసెంబర్‌1( జనం సాక్షి):  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయంలోని వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు అర్చకులు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శేషగిరి ఆలయ అధికారులు పాల్గొన్నారు.