ఎపి పోలీస్‌ వ్యవస్థ తీరుపై కేంద్రం నిఘా

పోలీస్‌ అధికారుల తీరును పరిశీలిస్తున్న హోంశాఖ

త్వరలోనే చర్యలు తప్పవంటూ ఎంపి సిఎం రమేశ్‌ హెచ్చరిక
విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఎపి పోలీస్‌ పనితీరుపై కేంª`దరం నిఘా పెట్టిందని బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌.. ఏపీ పోలీసు వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్‌ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపు నిఘాతో చూస్తుందని.. త్వరలోనే ప్రక్షాళన చేస్తోందంటూ స్పష్టం చేశారు. త్వరలోనే ఏపీలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని సీఎం రమేష్‌ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదంటూ విమర్శించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి, పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదు.. అవసర మైతే కేంద్రం కొందరు ఐపీఎస్‌ అధికారులను రీ కాల్‌ చేస్తుందంటూ రమేష్‌ వ్యాఖ్యానించారు. కొన్ని రాష్టాల్లో ఇప్పటికే పోలీస్‌ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని గుర్తుచేశారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని సీఎం రమేష్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోందని రమేష్‌ వివరించారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని రమేష్‌ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాలను అవలంభిస్తోందన్నారు. రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయని పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక అందుబాటులో లేదని.. సిమెంట్‌ ధరలు ఆకాశాన్ని అంటుతోందన్నారు. సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. సినిమా టిక్కెట్‌ రేట్ల తగ్గింపుపై థియేటర్‌ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్‌ చేయిస్తారా.. అంటూ మండిపడ్డారు. పొరుగు రాష్టాల్లో టిక్కెట్‌ ధరలు ఎంత ఉన్నాయి..? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడండంటూ సూచించారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్టీన్రి టాª`గ్గంªట్‌ చేస్తారా.. అని ప్రశ్నించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్‌ డిమాండ్‌ చేశారు. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్‌ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందన్నారు. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నార న్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం బిల్లులు కూడా ఇవ్వలేదని తెలిపారు. కడప స్టీల్‌ ఎª`లాంట్‌ శంకుస్థాపన చేశారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని.. రెండున్నరేళ్లల్లో స్టీల్‌ ఉత్పత్తి చేస్తామన్నారు.. ఏమైనా చేశారా..? అంటూ సీఎం రమేష్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.