బిజెపి నేతల గల్లా పట్టి నిలదీయండి

  


వడ్లు ఎందుకు కొనరో అడగండి
బిజెపి పోతనే రైతులకు మేలు
గజ్వెల్‌ ఆందోళనలో మంత్రి హరీష్‌రావు పిలుపు
సిద్దిపేట,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని కేంద్రం తీరుపై మంత్రి
నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గజ్వేల్‌లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన బీజేపీ నేతలను నిలదీయాలి. వడ్లు కొంటరా..కొనరా అని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ చేసిందేంటి ? రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలను గ్రామగ్రామాన నిలయాలని పిలుపునిచ్చారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో బీజేపీ నేతలు గ్రామాలకు వస్తే గళ్లా పట్టుకుని అడగాలన్నారు. అలాగే బీజేపీ తెలంగాణ ఏం చేసిందో ప్రశ్నించాలని సూచించారు. రైతన్న బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ గద్దే దిగాల్సిందేనన్నారు. బీజేపీ రైతులను దగా చేస్తోందని.. వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు సొల్లు కబుర్లు చెప్పడం మానుకుని వడ్లు కొంటరా?కొనరో సూటిగా చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ 24 గంటల కరెంటు ఇచ్చారన్నారు. అలాగే రైతుల సాగునీటి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అలాగే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తోందని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 50 వేల కోట్ల రైతుల ఖాతాల్లో నేరుగా జమచేసినట్లు వివరించారు. అలాగే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించినట్లు గుర్తుచేశారు. రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారని.. అయితే ట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని ఆరోపించారు. అయితే తెలంగాణ రైతు ఆగం కావాలి.. ఆ కోపం టీఆర్‌ఎస్‌ విూద వస్తే రాజకీయంగా లబ్ది పొందుదామని బీజేపీ నేతలు కుట్రు పన్నుతున్నారని ఆరో