ఎస్‌జిఎస్‌ను ఎయిడెడ్‌గా కొనసాగించాలని విద్యార్థుల ఆందోళన

విజయవాడ, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఎస్‌.జి.ఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగా నడపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 8వ రోజు విద్యార్థులు ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ నెంబర్‌ 42, 50 రద్దు చేయాలని అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. విద్యార్ధి సమస్యలపై స్థానిక ఎమ్మేల్యే స్పందించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. విద్యార్ధి వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు గోపినాయక్‌, జగ్గయ్యపేట మండల కార్యదర్శి ప్రణయ్‌ తేజ, ప్రదీప్‌, నర్మదా, కల్యాణి, ప్రత్యుష ఇతర  విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.