నేడు కర్నూలు జిల్లాకు సిఎం జగన్‌


భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

కర్నూలు,డిసెంబర్‌21( జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సిఎం హాజరు కానున్నారు. దీంతో కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి పంచలింగాల మాంటిస్సోరి స్కూల్‌ సవిూపంలో హెలిప్యాడ్‌ పనులను పరిశీలించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో భద్రత, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ నెల 22న ఉదయం 11.15 గంటలకు సీఎం
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, 11.25 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి పంచలింగాల సవిూపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారని అన్నారు. అక్కడ జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ముఖాముఖి అవుతారని తెలిపారు. రోడ్డు మార్గాన 11.55 గంటలకు వివాహ వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుని విమానంలో తిరిగి గన్నవరం వెళ్తారని వివరించారు.