మహబూబాబాద్,డిసెంబర్11 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాకు రావాల్సిన అన్ని రకాల నిధులు, పథకాలను, మంజూరు కావాల్సిన కేంద్రాలను సాధించడం ద్వారా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేద్దామని ఇందుకు అధికారులు సహకరించాలని ఎంపీ కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాకు రావాల్సిన అన్ని నిధులను, పథకాలను, మంజూరు కావాల్సిన కేంద్రాలను సాధించడం ద్వారా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేద్దామని అన్నారు. ఇందుకు అధికారులంతా సహకరించాలని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు వివిధ పథకాల ద్వారా మంజూరు కావాల్సిన నిధులను, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమలుచేయాలన్నారు. అమలులో ఎలాంటి జాప్యం చేయరాదన్నారు.