ఎయిడ్స్‌ మరణాలను తగ్గించడమే లక్ష్యంఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడరాదు

ఎయిడ్స్‌ డేలో మంత్రి హరీష్‌ రావు

ములుగులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి

హైదరాబాద్‌,డిసెంబర్‌1( జనం సాక్షి): ఎయిడ్స్‌ రోగులకు త్వరలో ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఎయిడ్స్‌ మరణాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎయిడ్స్‌ డే సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ ప్రాణాంతక వ్యాధి కాదని చెప్పారు. వ్యాధి నివారణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడటం తగదన్నారు సూచించారు. ఎయిడ్స్‌ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎయిడ్స్‌ మరణాల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు. గాలి ద్వారా, తాకడం ద్వారా ఎయిడ్స్‌ రాదన్నారు. ఎయిడ్స్‌ రాకుండా అవగాహన పెంచుదామని పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్‌ రోగులకు ప్రతినెలా రెండు వేల పదహారు రూపాయలు పింఛన్‌ అందిస్తోందని చెప్పారు. 1.30 లక్షల మంది ఎయిడ్స్‌ రోగులు ఉన్నారని, 70 వేల మందికి మందులు పంపిణి చేస్తున్నారురని తెలిపారు. ఎయిడ్స్‌ రోగుల కోసం ప్రత్యేకంగా వరంగల్‌, హైదరాబాద్‌లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రి పేద ప్రజలకు అందుబాటులోకి రాబోతోందన్నారు. నర్సింగ్‌ వృత్తిలో ఉన్న విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్‌ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎయిడ్స్‌ రహిత సమాజానికి పాటుపడాలని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు అవగాహన ర్యాలీని మంత్రి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజలు వైద్యాధికారుల సూచనలు పాటిస్తూ ఎయిడ్స్‌ నియంత్రణకు సహకరించాలన్నారు. ఎయిడ్స్‌ బారిన పడి జీవితాలను ఆగం చేసుకోవద్దని మంత్రి సూచించారు. అనంతరం రక్తదాన శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులకు రక్త దాతలకు ప్రశంసాపత్రాలను అందించారు.