ఇసుక్‌ మాఫియా దాడిలో విఆర్‌ఎ మృతి

  


పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

నిజామాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌ మండలం కండ్గావ్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ముఠా.. సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు వీఆర్‌ఏ గౌతమ్‌ ప్రయత్నించగా.. ఇసుక మాఫియా ముఠా వీఆర్‌ఏను చితకబాదింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ గౌతమ్‌ను ప్రభుత్వ ఆసుస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ గౌతమ్‌ మృతి చెందాడు. దీంతో వీఆర్‌ఏ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు.