లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు నెలాఖరు వరకు పొడిగింపు

న్యూఢల్లీి,డిసెంబర్‌8 జనం సాక్షి : కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ప్రత్రం లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇంతకు ముందు గడువు గత నెల నవంబర్‌ 30తో ముగియగా మరోసారి గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. పింఛన్‌దారులు పింఛన్‌ తీసుకునేందుకు లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించడం తప్పనిసరి. వివిధ రాష్టాల్లో కొనసాగుతున్న కొవిడ్‌ మహమ్మారి దృష్ట్యా బ్యాంకులు రద్దీగా ఉన్న సమయాల్లో వృద్ధులు కరోనా బారినపడే అవకాశం ఉండడంతో ఈ మేరకు జీవన ప్రమాణపత్రం సమర్పించేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. గడువు పొడగించిన వరకు పెన్షన్‌ అందుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.