తెలుగు రాష్టాల్ల్రో శీతల గాలుల ఎఫెక్ట్‌

మరింత పడిపోనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు..!

అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలుగు రాష్టాల్రు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర గాలులు తక్కువ ఎత్తులో ఉత్తరాంధ్రలోను.. తూర్పు గాలులు దక్షిణ ఏపీలోని రాయలసీమలోనూ వీస్తున్నాయి.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని.. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటి గ్రేడ్‌ తక్కువగా నమోదయ్యే అవకాశం
ఉందని.. దక్షిణ కోస్తా ఆంధ్రలో తక్కువ ఎత్తులో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రాయలసీమలో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా.. కనిష్ట ఉష్ణో గ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటి గ్రేడ్‌ తక్కువగా నమోదు కానున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.