`కామారెడ్డి రహదారిపైనిరసనలు
త్వరగా ధాన్యం కొనాలని డిమాండ్
కామారెడ్డి,డిసెంబర్7 (జనంసాక్షి) : వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల ` కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. టోకెన్‌లు ఇచ్చి రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు సకాలంలో ధాన్యం సేకరించడంలేదని అరోపించారు. దీంతో ఇప్పటికే తడిసిన ధాన్యంతో తాము తీవ్రంగా నస్టపోయామని అన్నారు. యాసంగి పంటలు వేసుకునే సమయంలో ఇª`ఆక తాము ధాన్యం అమ్మకాల కోసం రోడ్డుపై పడిగాపులు కాస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలుచేశారు. కొనుగోళ్లుచేపట్టకుండా,కేంద్రంపై నెప్పాన్ని నెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంతరి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రెండు నెలలుగా ధాన్యం సేకరించకుండా కాలయాపన చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి పార్లమెంట్ సమావేశంలో క్లారిటీ ఇచ్చినప్పటికీ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కావాలనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదిలావుంటే నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్‌లో కొనుకోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లను చేపట్టామని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందు నిలిపారు. ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు చెల్లింపులను అదేవిధంగా చేస్తున్నారు. మిగిలిన ధాన్యాన్ని మరో రెండు రోజుల్లో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. వారంలోపు ధాన్యం తరలింపు పూర్తిచేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో 451 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ ధాన్యాన్ని కొన్నారు. కొనుగోళ్లు దాదాపు దగ్గరపడడంతో 384 కేంద్రాలను మూసివేశారు. తేమ, ఇతర సమస్యలున్న మిగిలిన ధాన్యాన్ని మరో రెండు రోజులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వారంలోపు కొనుగోళ్లు పూర్తిచేయడంతో పాటు ధాన్యం అమ్మిన రైతులకు మొత్తం చెల్లింపులు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 లక్షల 27వేల 751 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత సీజన్‌కంటే ఎక్కువ మొత్తంలో ఈ దఫా కొనుగోలు చేశారు. జిల్లాలో దాదాపుగా 98శాతం ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేశారు. మరో 5వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోళ్లకు గన్నిబ్యాగులు, హమాలీలు వాహనాలు కొరత ఏర్పడినా త్వరగా నిర్ణయం తీసుకుని తరలింపు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 1230.39 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను చేశామన్నారు.