మరోరైతు బలవన్మరణం

వరంగల్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని పరకాల మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో సురేష్‌ అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్చి, వరి పంటి వేసి సురేష్‌ నష్టపోయాడు. రైతు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా... ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలంటూ ఇదే గ్రామానికి చెందిన రైతు శతేంధర్‌ రెడ్డి ఇటీవల క్రాప్‌ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే.