సయ్యద్‌ వికారుద్దీన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి: ఉర్దూ దినపత్రిక ’రహనుమా ఏ దక్కన్‌’ చీఫ్‌ ఎడిటర్‌, ఇండో అరబ్‌ లీగ్‌ చైర్మన్‌ సయ్యద్‌ వికారుద్దీన్‌ ఖాద్రీ(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. సయ్యద్‌ వికారుద్దీన్‌ కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వికారుద్దీన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతిపట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. వికారుద్దీన్‌ అంత్యక్రియలు పురానాపూల్‌లోని హజ్రత్‌ మూసా ఖాద్రీ దర్గాలో ఇవాళ జరగనున్నాయి.