కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌

కడప, డిసెంబర్‌11 (జనంసాక్షి) : వల్లూరు మండలంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అభి రెడ్డి మల్లికార్జున్రెడ్డి వీటిని ప్రారంభించారు. పుల్లావుల  గంగమ్మ జ్ఞాపకార్థం పుల్లావుల గంగమ్మ మెమోరియల్‌ కబడ్డీ టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ సురేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో  ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్పిటిసి వెంకటసుబ్బయ్య, ఇంది రెడ్డి శంకర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.