యాదాద్రిని దర్శించిన నీతి ఆయోగ్‌ అధికారి

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌9(జనంసాక్షి ):  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని గురువారం నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి వేద ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ఇదో మహత్తర కట్టడమని ప్రస్తుతించారు.