ప్రకాశం జిల్లాలో మరో మహిళకు ఒమిక్రాన్‌

ఇద్దరు వ్యక్తులకు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స

ఒంగోలు,డిసెంబర్‌31 (జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోకి ప్రవేశించి అన్ని రాష్టాల్రను కలవరపెడుతోంది. ఇప్పటికే పలు రాష్టాల్ల్రో ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1,270కు చేరుకుంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్‌ నుండి వచ్చిన ఓ కుటుంబంలో 50 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ గా నిర్దారణ అయినట్లు వైద్యాశాఖ అధికారులు వెల్లడిరచారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించి శాంపిల్స్‌ ను వైద్యసిబ్బంది హైదరాబాద్‌ లోని సీసీఎంబీ లాబ్‌కు పంపించారు. దీంతో ఒమిక్రాన్‌గా నిర్దారణ కావటంతో మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితురాలిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఇప్పటికే ఒంగోలులో దక్షిణాఫ్రికా నుండి ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ గా నిర్దారణ ఆ వ్యక్తికి కూడా రిమ్స్‌లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే ఒంగోలు రిమ్స్‌లో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య రెండుకు చేరుకుంది.