శ్రీరంగం బయలుదేరిన సిఎం కెసిఆర్‌

కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంతో తిరుచ్చి చేరిక

హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్లారు. తిరుచిరాపల్లిలో శ్రీరంగం రంగనాథస్వామిని సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకో నున్నారు. రాత్రికి చెన్నైలోనే బస చేసి, రేపు సీఎం స్టాలిన్‌ను కేసీఆర్‌ కలిసే అవకాశం ఉంది. తొలుత
సీఎం కేసీఆర్‌ సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి తమిళనాడులోని తిరుచి చేరుకుంటారు. హోటల్‌లో సేదతీరాక.. రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వెళ్తారు. రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. 3 గంటలకు తిరుచి విమానాశ్రయానికి పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, ఐటీసీ గ్రాండ్‌ చోళలో బస చేస్తారు. చెన్నైలో ఆయన తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నట్లు సమాచారం.