హైదరాబాద్,డిసెంబర్24(జనం సాక్షి): మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధుయాష్కీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నకిలీ, ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపారని పిటిషనర్ పేర్కొన్నారు. చట్టరిత్యా చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని గోనె ప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అశంపై గతంలో పలుమార్లు పోలీస్ ఉన్నతాధికారులకు మధుయాష్కీపై గోనెప్రకాష్ ఫిర్యాదులు చేశారు. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.
మధుయాష్కీపై హైకోర్టులో కేసు