రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి


మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):- జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ’రైతన్న’ సినిమాను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన నూతన రైతు చట్టాలు, దాని పర్యవసానాలను కండ్లకు కట్టినట్లు చూపించారన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలు తీసి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించడం ఆర్‌ నారాయణ మూర్తికే సాధ్యం అన్నారు. అందుకు గాను నిర్మాత, డైరెక్టర్‌, నటుడు ఆర్‌.నారాయణ మూర్తికి అభినందనలు తెలియజేశారు.