సులభంగతంలో ఎప్పుడూ లేనంతగా రోడ్ల నిర్మాణం: ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి,డిసెంబర్11 (జనంసాక్షి) : ఆలేరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం వరకు సుమారు రెండు విభాగాలుగా ఆలేరు నుంచి మోత్కూరు వరకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పనులు చురకుగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్ల నిర్మాణంతో గ్రామాలకు కనెక్టివిటీ పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ఎప్పుడు మా రోడ్లకు మహార్దశ వస్తుందో, మా రవాణా వ్యవస్థ మెరుగు పడుతుందోనని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం రోడ్లకు నిధులు మంజూరు చేసిందన్నారు. 60 ఏళ్ల పాలనలో ఆదరణకు నోచుకోని రోడ్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ పల్లెల నుంచి పట్టణాలకు రవాణా వ్యవస్థను మెరుగవుతోందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. అలాగే నియోజకవర్గ కేంద్రాల నుంచి మండల కేంద్రాలను కలుపుతూ జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావించింది. మండల ప్రజలు బీటీ డబుల్ రోడ్డు పనులు గుండాల మండలంలో శర వేగంగా సాగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలతో పనులు జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్లడం, ఆరోగ్య సమస్యలపై రాష్ట్ర రాజధానికి వెళ్లడానికి రోడ్లు ఎంతగానో మేలు చేస్తాయని అన్నారు. ఈ రోడ్డు నిర్మాణాల పనులు జనవరి చివరికల్లా పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు అంటున్నారు.రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతుండడంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.