పేదవాడికి మేలు జరగడం ఇష్టం లేని చంద్రబాబు

 

ఆస్తికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వండ తప్పా
ఓటిఎస్‌తో ఆస్తికి రక్షణ వస్తుందని వెల్లడి
తణుకులో పథకాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌
చంద్రబాబు తదితరులను నిలదీయాలని పిలుపు
ఏలూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎందుకు మాకు మంచి జరక్కుండా అడ్డుకుంటున్నారో అడగాలని సిఎం జగన్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామ మాత్రపు ధరకు రిజిస్టేష్రన్‌ చేయించి ఇస్తుంటే విూకెందుకు కడుపుమంట అని అడగండి. మా ఇళ్లను ఓటీఎస్‌ లేకుండా మార్కెట్‌ రేట్లకు కొంటారా అని అడగండి. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్టేష్రన్‌ చేస్తుంటే విూకెందుకు కడుపుమంట అని చంద్రబాబు తదితర విూడియానేఉ ప్రశ్నించాలని సీఎం అన్నారు.
రిజిస్టేష్రన్‌ డాక్యుమెంట్లు లేకపోతే విూరు కొంటారా? అని వారిని ప్రశ్నించాలన్నారు. విూ ఆస్తులైతే రిజిస్టేష్రన్లు అయి ఉంటాయి. పేదవాళ్లకైతే రిజిస్టేష్రన్లు అవ్వకూడాదా? మంచి చేస్తుంటే చంద్రబాబు, ఆయన వందిమాగధులు జీర్ణించుకోలేపోతున్నారని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలు ఐదు సార్లు పంపితే.. ఏదో ఒక వంకతో తిప్పి వెనక్కి పంపిన పెద్ద మనిషి చంద్రబాబు అన్నారు. రుణమాఫీ కాదు కాదా.. వడ్డీ మాఫీ చేయని పెద్ద మనుషులు వీరని సీఎం దుయ్యబట్టారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదని.. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతి రూపం ఇల్లు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 50 లక్షల మంది కుటుంబాలకు లబ్దిచేకూరే మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని
విధంగా సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు. ఓటీఎస్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటీఎస్‌ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటిపై సర్వహక్కులు కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ పథకం తీసుకుని వచ్చామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్టేష్రన్‌ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ జరుగుతోందని అన్నారు. రూ.6 వేల కోట్ల రిజిస్టేష్రన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.లక్షా 58 వేల కోట్లు. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని సీఎం అన్నారు.
తణకులో ఇంటి మార్కెట్‌ విలువ రూ.30 లక్షల వరకు ఉంది. గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్దిదారులను ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి యజమానులుగా మారుస్తున్నాం. కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీతో పాటు రూ.6వేల కోట్ల రిజిస్టేష్రన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ.16వేల కోట్ల మేర లబ్ది చేకూరుతుందన్నారు. నామమాత్రపు రుసుంతో 10వేల నిమిషాల్లోనే రిజిస్టేష్రన్‌ చేస్తున్నాం. క్రయ విక్రయాలకు లింక్‌ డాక్యు మెంట్లు అవసరం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ’ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు మంచి జరిగే రోజు ఇదని అన్నారు. సీసీఎస్‌ ఉద్యోగి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌ పథకం మా కుటుంబానికి ఎంతో స్వాంతన కలిగించింది. రాష్ట్రంలో పేదల గురించి సీఎం జగన్‌ ఆలోచించినంతగా మరే వ్యక్తి ఆలోచించలేరు. ఈ పథకంపై టీడీపీ నాయకులు మా ఇంటికి వచ్చి ప్రభుత్వం వచ్చాక రూపాయి లేకుండా ఇంటి పట్టా ఇస్తామని చెప్పారు. ఆ విషయం వినగానే నాకు నవ్వొచ్చింది. నాతో మాట్లాడిన పాలకులే మూడేళ్ల కింద అధికారంలో ఉన్నారు. ఆనాడు ఏవిూ చేయక ఇప్పుడు ఏదో చేస్తామని మభ్యపెట్టడం టీడీపీ నాయకులకే సాధ్యమని అన్నారు. సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్దిదారు సుజాత మాట్లాడుతూ.. ’ఈ పథకం పెట్టినందుకు విూకు ధన్యవాదాలు. అన్నారు. 9 ఏళ్ల క్రితం నేను ఇళ్లు కట్టుకున్నా అయితే ఇప్పటిదాకా ఇంటికి సంబంధించి నాకు ఎటువంటి ఇంటి పత్రం లేదు. ఇప్పుడు ఈ పథకం క్రింద దాదాపు పది లక్షల రూపాయల ఆస్తిని నా చేతిలో పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందన్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.