ఒంఓగలు,డిసెంబర్10 జనంసాక్షి: : చంద్రబాబు ఎలా అబద్దాలు చెబుతాడో నారా లోకేష్ కూడా అలాగే అబద్దాలు చెబుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ఇష్టమైన వారి వద్దే ఓటీఎస్ తీసుకోమని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2014 ఎన్నికలకు 600 హావిూలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన మంత్రి బాలినేని ప్రజలు అన్నీ చూస్తున్నారని అన్నారు.
ఇష్టమైతేనే ఓటిఎస్..లేకుంటే లేదుమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి