నాగాలాండ్‌ ఘటనపై అమిత్‌ షా ప్రకటన


ఉద్రవాదుల అనుమానంతో ఆర్మీ కాల్పులు

మరణించిన కుటుంబాలకు 11లక్షల ఎక్స్‌గ్రేషియా

న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : నాగాలాండ్‌లో కూలీలపై ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన పట్ల  లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన చేశారు. మాన్‌లోని ఓటింగ్‌లో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఆర్మీకి సమాచారం వచ్చిందని, ఆ సమయంలో అనుమానాస్పద ప్రాంతంలో సుమారు 21 మంది కమాండోలు ఆపరేషన్‌కు సిద్దమయ్యారని, అయితే అక్కడకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిందన్నారు. దీంతో ఆ వాహనంలో తీవ్రవాదులను తరలిస్తున్నట్లు అనుమానించి ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని షా తెలిపారు. ఆ వాహనంలో ఉన్న 8 మందిలో 6 మంది కాల్పులకు బలైనట్లు ఆయన చెప్పారు. గాయపడ్డ ఇద్దర్ని సవిూపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆర్మీ తరలించిందన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి, రెండు వాహనాలు ధ్వంసం చేశారని, సైనికులపై తిరగబడ్డారని హోంమంత్రి చెప్పారు. గ్రామస్థుల తిరుగుబాటులో ఓ సైనికుడు మృతిచెందినట్లు ఆయన వెల్లడిరచారు. ఆత్మరక్షణ కోసం సైనికులు ఫైరిరగ్‌ జరిపారన్నారు. కాల్పుల వల్ల మరో ఏడు మంది పౌరులు మృతిచెందినట్లు షా వెల్లడిరచారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. అదుపులోనే ఉందన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని డిసెంబర్‌ 5వ తేదీన నాగాలాండ్‌ డీజీపీ, కవిూషనర్‌ సందర్శించారన్నారు. ఆర్మీ కాల్పుల ఘటన పట్ల ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశామన్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నెల రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలావుంటే  నాగాలాండ్‌ ఘటనలో మరణించిన వారి కుటుంబాల కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనుందని నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియూ రియో వెల్లడిరచారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాబలగాలు ఆదివారం నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో సెర్చింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన కొంతమంది యువకులను చూసి ఉగ్రవాదులుగా పొరబడిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించారు. అదేవిధంగా ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.