కిడాంబికి అభినందిన వెల్లువలు


ఎందరికో స్ఫూర్తి ఇస్తుందంటూ మోడీ ట్వీట్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫనల్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. రజత పతకం సాధించినందుకు అభినందనలు. ఈ విజయంతో ఎంతోమంది క్రీడాకారులకు స్పూర్తినిస్తుంది. బ్యాడ్మింటన్‌ వైపు అడుగులు వేసేందుకు మరింతమందికి ఊతమిస్తుందని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సింగిల్స్‌లో భారత షట్లర్‌ రజతం సాధించడం ఇదే తొలిసారి. గతంలో ప్రకాశ్‌ పదుకొనె (1983), సాయిప్రణీత్‌ (2019)లో కాంస్య పతకాలు సాధించారు. కాగా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు కూడా శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు.