లారీ ఢీ కొట్టడంతో వాగులో పడ్డ ఆటో..

ఒకరు మృతిక్రేన్‌ సాయంతో బయటపడ్డ ఆటో

నెల్లూరు,డిసెంబర్‌ 10(ఆర్‌ఎన్‌ఎ): నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో వంతెన పైనుంచి వాగులో పడిపోవడంతో ఒకరు మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురిని స్థానికులు రక్షించారు. సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెను పైకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వెళ్లి వాగులో పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాగులో నుంచి ఏడుగురిని బయటకు తీశారు. ఒకరు మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయ ఏర్పడిరదని పోలీసుల వెల్లడిరచారు. ఐదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌పి విజయారావు తెలిపారు. గల్లంతైన వారు కర్రె నాగరాజు, కర్రె పద్మ, కర్రె పుల్లయ్య, కర్రె సంపూర్ణమ్మ, దివెనపు అª`దదెమ్మగా తెలిపారు. మృతురాలు నాగవల్లి(14) గుర్తించారు. ఉదదయం ఆటోను క్రేన్‌ సాయంతో బయటకు తీసారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు.