ప్రైవేటీకరణ చర్యలకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె


హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల పాటు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగారు. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల ముందు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందులో గురువారం మొదటి రోజు సమ్మెతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడిరది. బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ధర్నాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాగా, బ్యాంకు ఉద్యోగుల న్యాయబద్ధమైన సమ్మెకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి తమ మద్దతు పలికారు.