విశాఖ ఉక్కుపై జనసేన డిజిటల్‌ ఉద్యమం

  

వైసిపి ఎంపిలకు చిత్తశుద్ది లేదని మండిపాటు
కనీసం ప్లకార్డులతో అయినా నిరసన తెలపరా
మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌
అమరావతి,డిసెంబర్‌20( జనం సాక్షి ): విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అధికార వైసిపికిచిత్తశుద్ది లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై జనసేనాని స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై మళ్ళీ మండిపడ్డారు. ఆంతేకాదు వైసీపీ ఎంపీలకు స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అంటూ కేంద్రానికి తమ నిరసన తెలిసేలా కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవోడం లేదంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విట్టర్‌ ద్వారా పవన్‌ కళ్యాణ్‌ డిజిటల్‌ క్యాంపెయిన్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు , నేతలు ప్లకార్డులు పట్టుకుని ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఒక్క ఎంపీ కూడా ఉక్కు పరిశ్రమ కోసం ప్లకార్డు పట్టుకొని నేపథ్యంలో మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ విూడియా వేదికగా వైసిపీ ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు. అంటూనే వైసీపీ నేతలు విశాఖ కార్పోరేషన్‌ ఎన్నికల సమయంలో.. చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణని తమ ప్రాణాలను త్యాగం చేసి మరీ అడ్డుకుంటామని అన్నారు.. అయితే విూరు విూ ప్రాణాలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు అంటూ పవన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. స్టీల్‌ ఎª`లాంట్‌ పరిరక్షణ కోసం జనసేన మూడు రోజుల పాటు డిజిటల్‌ క్యాంపెయిన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎంపీలు విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమం చేయాలంటూ హ్యాష్‌ టాగ్స్‌ తో ట్రెండ్‌ చేస్తున్నారు.