మాజీ గవర్నర్ నరసింహన్‌కు కెసిఆర్ పరామర్శ
చెన్నై,డిసెంబర్15 (జనంసాక్షి):- తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్‌ను పరామర్శించారు. మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నరసింహన్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. ఇవాళ నరసింహన్‌ను కావేరీ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ గవర్నర్ మరో 3`4 రోజులు ఆస్పత్రిలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.