ఊహించినట్లుగానే ప్రకటించిన అమరీందర్
చండీగఢ్,డిసెంబర్6 (జనంసాక్షి ) : అందరూ ఊహించినట్లుగానే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఆయనపార్టీని పెట్టి బిజెపితో జతకడతారన్న వార్తలు నిజమయ్యాయి. అదేవిధంగా సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాకు చెందిన శిరోమణి అకాలీదల్ సంయుక్త్ పార్టీతో కూడా వచ్చే ఎన్నికల్లో జట్టు కట్టనున్నట్లు తెలిపింది. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో కూటమిగా బరిలోకి దిగాలని సూతప్రాయంగా నిర్ణయించినట్లు వెల్లడిరచింది. ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేయనున్నారనే విషయంలో త్వరలో ఒక ప్రకటన చేయనున్నట్లు అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని తాను రెండు పార్టీల నేతలకు సూచించానని తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్నదే తమ లక్ష్యమని, తాము కచ్చితంగా గెలిచి తీరుతామని అమరీందర్‌సింగ్ ప్రకటించారు.