గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2022`23 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ నెల 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను జనవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రవేశాలను ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీలోని బీఏ కోర్సులకు నిర్వహిస్తున్నారు. ఇతర వివరాల కోసం లిలిలి.బిబలిస।తిబ.జీఞ.తిని వెబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు.